ఎన్టీఆర్‌కి 10.. బాల‌య్య‌కు 1❓❓

  |   Tollywood

ఈ సంక్రాంతికి విడుద‌లైన సినిమాల్లో.. ఎన్టీఆర్ సినిమా మాత్ర‌మే ఓవ‌ర్సీస్‌లో భారీ వ‌సూళ్లు తెచ్చుకొంది💰. నాన్న‌కు ప్రేమ‌తో దాదాపుగా రూ.10 కోట్లు వ‌సూలు చేసింది💸. ఈ విష‌యంలో డిక్టేట‌ర్ మాత్రం బాల‌య్య అభిమానుల్ని తీవ్రంగా నిరాశ ప‌రిచింది👎.ఈ సినిమాకి మొత్త‌మ్మీద ఓవ‌ర్సీస్‌లో కోటి రూపాయ‌లు కూడా ద‌క్క‌క‌పోవ‌డం బాల‌య్య అభిమానుల‌నే కాదు, ఇండ్రస్ట్రీ వ‌ర్గాల‌నూ ఆశ్చ‌ర్యానికి గురిచేసింది😲. ఓవ‌ర్సీస్‌లో బాల‌య్య సినిమాల‌కు అంత క్రేజ్ లేద‌న్న‌మాట వాస్త‌వం☝. కాక‌పోతే లెజెండ్, సింహాలు అక్క‌డ బాగానే ఆడాయి👍. ల‌య‌న్ కూడా మంచి వ‌సూళ్ల‌నే రాబ‌ట్టింది👍. కానీ డిక్టేట‌ర్ ఆ మ్యాజిక్ చేయ‌లేక‌పోయింది👎. డిక్టేట‌ర్ కంటే.. శ‌ర్వానంద్ ఎక్స్‌ప్రెస్ రాజాకే ఓవ‌ర్సీస్‌లో మంచి వ‌సూళ్లు ద‌క్కాయి💰. బీసీల్లో వ‌సూళ్లు కుమ్ముకొంటున్న బాల‌య్య‌.. ఏ సెంట‌ర్ల‌పై ఎప్పుడు ఆధిప‌త్యం చూపిస్తాడో??❓.