మరో 150 థియేటర్లలో సోగ్గాడే చిన్నినాయన✨✨

  |   Tollywood

కళ్యాణ్‌కృష్ణ దర్శకత్వంలో అన్నపూర్ణ స్టూడియోస్ బేనర్‌పై నిర్మించిన ‘సోగ్గాడే చిన్నినాయనా’ సంక్రాంతికి విడుదలై అద్భుత విజయాన్ని సాధించింది👍. నాగార్జున ద్విపాత్రాభినయంతో రూపొందిన ఈ సినిమా పండుగకు విడుదలైన సినిమాల్లో అగ్రగామిగా నిలిచింది👍. దీంతో ఈ చిత్ర ప్రదర్శనకు బయ్యర్లు ఆసక్తి చూపుతున్నారు👍. 450 స్క్రీన్స్‌పై విడుదలైన ఈ చిత్రాన్ని ఈనెల 22నుండి మరో 150 స్క్రీన్స్ పెంచి 600 థియేటర్లలో ప్రదర్శిస్తున్నారు👋. నైజాంలో కేవలం 120 థియేటర్లలోనే విడుదలై 6 రోజుల్లోనే 5కోట్ల 20 లక్షలకు పైగా షేర్ సాధించింది💰. ఇప్పుడు మరో 55 థియేటర్లలో ఈ సినిమా ప్రదర్శించనున్నట్లు నైజాంలో డిస్ట్రిబ్యూట్ చేసిన ఏషియన్ సునీల్ చెప్పారు👍.