ఆ క్షణం చిరస్మరణీయం...✨

  |   క్రికెట్

వేలాది ప్రేక్షకుల మధ్య 2011 ప్రపంచకప్ ఫైనల్లో జాతీయ గీతం పాడుతున్నప్పుడు కలిగిన అనుభూతి తన జీవితంలో మరిచిపోలేనిదని భారత క్రికెట్ బ్యాటింగ్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ తెలిపారు👍. ‘జనగణమన పాడుతున్నప్పుడు మన తల ఎప్పుడూ పైకే ఉంటుంది☝. అదే స్టేడియంలోని వేలాది ప్రేక్షకులు ఆలపిస్తున్నప్పుడు మన ఛాతీ గర్వంతో ఉప్పొంగి పోతుంటుంది👍. ఇలాంటి అనుభం నాకు 2003 ప్రపంచకప్‌లో పాకిస్తాన్‌తో ఆడుతున్నప్పుడు.. స్వదేశంలో జరిగిన ప్రపంచకప్ ఫైనల్లోనూ ఎదురైంది👌. ముఖ్యంగా ముంబైలోని వాంఖడే స్టేడియం మొత్తం జాతీయ గీతాలాపన చేసిన వైనం ఇంకా నా చెవుల్లో మార్మోగుతూనే ఉంది👂.