ఐఫా అదరహో..✨

  |   Tollywood

దక్షిణాది సినీ పరిశ్రమలో తొలిసారిగా హైదరాబాద్ వేదికగా ఐఫా అవార్డుల ప్రదానోత్సవం అంగరంగవైభవంగా ప్రారంభమైంది👍. ఆది, సోమవారాలలో రెండురోజులపాటు జరిగే ఈ వేడుకకు దక్షిణాది సినీతారలు తరలివచ్చారు👌. గచ్చిబౌలి ఔట్‌డోర్ స్డేడియంలో అట్టహాసంగా ఈ వేడుకలు జరుగుతున్నాయి👏. ఈ వేడుకల ద్వారా సేకరించిన మొత్తాన్ని ఇటీవల చెన్నైలో వచ్చిన తుపాను బాధితులకు అందజేయనున్నారు👍. దాదాపు కోటి రూపాయలు విరాళం సేకరిస్తారని అంచనా💰. ఇప్పటివరకూ బాలీవుడ్‌కి మాత్రమే పరిచయమైన ‘ఐఫా’ అవార్డులు ఈ వేడుకతో మొదటిసారి సౌతిండియన్ సినిమాకూ పరిచయమవుతున్నాయి😂.