తొడ‌గొడితే ట్రైన్ వెళ్లిపోవ‌డమేంటి?❓❓

  |   Tollywood

ప‌ల్నాటి బ్ర‌హ్మనాయుడు సినిమాని తెలుగు ప్రేక్ష‌కులు అంత తేలిగ్గా మ‌ర్చిపోరు☝. అదేం సూప‌ర్ హిట్ మూవీ కాదు..కానీ.. బాల‌య్య ఫ్యాన్స్‌కి మాత్రం స్పెష‌ల్‌👍. ఎందుకంటే అప్ప‌టి వ‌ర‌కూ ఏ తెలుగు సినిమాల్లోనూ క‌నిపించ‌ని విన్యాసం ఒక‌టి.. అందులో బాల‌య్య చేశాడు👆. అదే.. తొడ గొడితే ట్రైన్ వెన‌క్కి వెళ్లిపోవ‌డం👌. ఆ సీన్ పై ర‌క‌ర‌కాల స్నూఫ్‌లు వ‌చ్చాయి😂.. ఆ సీన్ కి సంబంధించిన విజువ‌ల్స్ ఫేస్‌బుక్ లో ఇప్ప‌టికీ ర‌న్ అవుతూనే ఉంటాయి🙌. తెలుగు చిత్ర‌సీమ‌లో క‌నీవినీ ఎరుగ‌ని అద్భుతంగా ఆ సీన్‌పై జోకులు వేసుకొంటారు సినీ ప్రియులు👍. ఈ స‌న్నివేశం గురించి బాల‌య్య తొలిసారి స్పందించాడు☝. తొడ‌గొడితే ట్రైన్ వెన‌క్కి వెళ్లిపోవ‌డం ఏమిటి? అది చాలా టూమ‌చ్‌గా అనిపించింది. ఆరోజు ఏదో వేడిలో చేసేసిన సీన్ అది👆. ఆ త‌ర‌వాత త‌ల‌చుకొంటే న‌వ్వొస్తుంది.. ఎందుకు చేశానా అనిపిస్తోంది అంటూ చెప్పుకొచ్చాడు👏. నిజంగా... బాల‌య్య ఈ విష‌యాన్ని నిర్మొహ‌మాటంగా ఒప్పుకోవ‌డం, తాను చేసిన సీన్‌కి టూమ‌చ్ అంటూ స‌ర్టిఫికెట్ ఇవ్వ‌డం.. ఆయ‌న సింప్లిసిటీకి నిద‌ర్శ‌నంగా క‌నిపిస్తాయి👍. బాల‌య్యే స్వ‌యంగా ఇది టూమ‌చ్ సీన్ అని చెప్పేశాడు కాబ‌ట్టి.. ఇకమీద‌ట ఆ జోకుల‌న్నీ ఆగిపోయిన‌ట్టే👊.