ఫినిషింగ్‌పై ధోని వ్యాఖ్య❓❓

  |   క్రికెట్

ధోని అంటే బెస్ట్ ఫినిషర్... చివర్లో ఎన్ని పరుగులు చేయాల్సి ఉన్నా, ఎంత రన్‌రేట్ అవసరమైనా అతను క్రీజ్‌లో ఉంటే చాలు గెలిపిస్తాడనే ధీమా అందరిది👍. కానీ ఇటీవలి కాలంలో అతను ఇలా ముగిస్తున్న మ్యాచ్‌లు పెద్దగా ఉండటం లేదు👎. నాలుగో వన్డేలో ఘోరంగా విఫలమైన అతను... సిడ్నీలో మ్యాచ్ ముగించకపోయినా, ఆఖరి ఓవర్లో భారీ సిక్సర్‌తో పని సులువు చేశాడు👍. అయితే ఇదేమీ అంత తేలికైన విషయం కాదని, ప్రతీసారి అంచనాలు అందుకోవడం సాధ్యం కాదని స్పష్టం చేశాడు☝.