బోర్ కొట్టేసిన పాపలు...టాప్ ప్లేస్ ఎవరిది..?❓

  |   Tollywood

సినిమా కథ ఎంత బాగున్నా, హీరోయిన్ లేకపోతే, సగటు తెలుగు ప్రేక్షకుడు సినిమాను ఏదో వెలితిగానే ఫీలవుతాడు☝.. అందుకే, తెలుగులో ఎంతటి ప్రయోగాత్మక సినిమాలొచ్చినా, వాటిలో కమర్షియల్ ఎలిమెంట్స్ పేరుతో, అవసరం లేకపోయినా హీరోయిన్ పాత్రను సృష్టిస్తుంటారు మన దర్శక నిర్మాతలు👍..కానీ సమస్యేంటంటే, మన ప్రేక్షకులు ఒకే హీరోయిన్ ను కూడా ఎక్కువ కాలం చూడలేరు🙅... ఒకప్పుడు మహానటి సావిత్రి లాంటి వాళ్లను ఎన్ని సంవత్సరాలైనా,కన్నార్పకుండా చూసేవారు☝.. కానీ అది గతం..ఇప్పుడు కథానాయికకు గట్టిగా చెప్పుకుంటే, ఆరేడేళ్లకు మించి స్పాన్ ఉండట్లేదు👎. రకుల్ ప్రీత్, హెబ్బా పటేల్, లావణ్య త్రిపాఠి లాంటి వాళ్లకు డిమాండ్ పెరగడం వెనుక కారణం అదే.☝.మరి రాబోయే రెండు మూడేళ్లలో నెంబర్ గేమ్ లో టాప్ ప్లేస్ ను ఎవరు దక్కించుకుంటారో చూడాలి👀..