మంచి బౌలర్లను తీర్చి దిద్దాలి: కెప్టెన్ ధోని❗

  |   క్రికెట్

భారత బౌలింగ్ గొప్పగా లేకపోవడం సమస్యగా మారిందని కెప్టెన్ ధోని అన్నాడు☝. ఇకపై టెస్టులు, పరిమిత ఓవర్లకు వేర్వేరుగా బౌలర్లను గుర్తించి తీర్చిదిద్దాల్సిన అవసరం వచ్చిందని అభిప్రాయపడ్డాడు👍. ‘గత మ్యాచ్‌లో నేను అవుట్ కాగానే జట్టు కుప్పకూలింది👎. అలా కాకూడదనే ఆరంభంలో భారీ షాట్లకు పోకుండా జాగ్రత్తగా ఆడాను. నాకే ఇబ్బంది అవుతున్న చోట జూనియర్లకు మరింత సమస్య అయ్యేది☝.మరో 10-15 మ్యాచ్‌ల వరకు అవకాశం ఇచ్చే విధంగా మనీశ్ పాండే ఆడాడు👍. పరిస్థితులకు తగినట్లుగా అతని బ్యాటింగ్ అద్భుతంగా సాగింది👌. ఈ ఇన్నింగ్స్ అతనికే ఒక పాఠంలాంటిది☝. తొలి మ్యాచ్‌లోనే చాలా బాగా ఆడిన బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రాను ప్రత్యేకంగా ప్రశంసించాలి👏. అయితే టి20ల కోసం మన ఫీల్డింగ్ మరింత మెరుగు పడాల్సి ఉంది’ అని అన్నాడు💦. తన రిటైర్మెంట్ గురించి అడుగుతున్నవారు ‘పిల్’ వేసి చూడాలని ధోని సరదాగా వ్యాఖ్యానించాడు😂.