సైంటిస్టుగా మోక్షజ్ఞ🌟🌟

  |   Tollywood

ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణ ఇప్పుడు తన 100వ సినిమా తెరకెక్కించే పనిలో ఉన్నాడు👍. ఆయన లేటెస్ట్‌గా ‘ఆదిత్య 369’ సీక్వెల్ రానుందని నందమూరి బాలకృష్ణ స్వయంగా తెలిపారు☝. ఈ చిత్రం ద్వారా తన కుమారుడు మోక్షజ్ఞ తెలుగు ప్రేక్షకులకు పరిచయం కానున్నాడన్న విషయం కూడా ఆయనే తెలిపారు👌. దీంతో ఈ చిత్రంలో మోక్షజ్ఞ ఎలా కన్పిస్తాడా అనే ప్రశ్న ఆయన అభిమానుల్లో తలెత్తింది👆. నిజానికి అతడిని సోలో హీరోగా పరిచయం చేస్తారని అనుకున్నారు☝. కాని ఇప్పుడు బాలయ్య సినిమాలోనే యువరాజు పాత్రలో కనిపిస్తారని వార్తలు వచ్చినప్పటికీ.. తాజాగా మోక్షజ్ఞ ఓ సైంటిస్టు పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది👍. టైం మెషిన్‌కు సంబంధించిన చిక్కుముడిని విప్పే ఓ గణిత మేథావి పాత్రలో మోక్షజ్ఞ కనిపించనున్నాడని తెలిసింది👍. ఈ పాత్రలో మోక్ష కేవలం 10 నిముషాలు మాత్రమే కనిపిస్తాడని చెబుతున్నారు😻. సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో రూపొందే ఈ సినిమా వచ్చే నెలలో సెట్స్‌పైకి రానుంది👍.