ఇంగ్లండ్ లక్ష్యం 382❓❓

  |   క్రికెట్

దక్షిణాఫ్రికాతో జరుగుతున్న నాలుగో టెస్టులో 382 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఇంగ్లండ్ బ్యాటింగ్ తడబడింది☝. మ్యాచ్ నాలుగో రోజు సోమవారం ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ 3 వికెట్ల నష్టానికి 52 పరుగులు చేసింది👆. రూట్ (19 బ్యాటింగ్), టేలర్ (19 బ్యాటింగ్) క్రీజ్‌లో ఉన్నారు. గెలుపు కోసం ఇంగ్లండ్ చివరి రోజు మరో 330 పరుగులు చేయాల్సి ఉండగా, చేతిలో 7 వికెట్లు ఉన్నాయి👆. అంతకుముందు దక్షిణాఫ్రికా తమ రెండో ఇన్నింగ్స్‌ను 5 వికెట్ల నష్టానికి 248 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది☝. హషీం ఆమ్లా (96; 11 ఫోర్లు) త్రుటిలో సెంచరీ చేజార్చుకున్నాడు👎. అండర్సన్‌కు 3 వికెట్లు దక్కాయి☝.