జూ.ఎన్టీఆర్ సంచలన వ్యాఖ్యలు❗❗

  |   Tollywood

'నాన్నకు ప్రేమతో' భారీ విజయంతో జోష్ మీదున్న జూ. ఎన్టీఆర్ చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపాయి💥. 2009లో తనకు జరిగిన ప్రమాదాన్ని గుర్తు చేసుకొంటూ ఆయన చేసిన కమెంట్స్తో అందరూ షాకయ్యారు❗. తాను చావుకు భయపడే వ్యక్తిని కాదని.. మృత్యువు తనదాకా వస్తే సంతోషంగా వెళ్లిపోతానని వ్యాఖ్యానించాడు☝. 2009లో మార్చి 26 జరిగిన యాక్సిడెంట్ తన జీవితాన్ని పూర్తిగా మార్చేసిందని ఓ ఇంటర్వ్యూలో ఎన్టీఆర్ చెప్పాడు👆. జీవితాన్ని తాను చూసే కోణమే మారిపోయిందని తెలిపాడు. అది తన రెండవ జన్మగా భావిస్తానన్నాడు👍. అందుకే తన భార్య లక్ష్మీప్రణతి బర్త్ డే కూడా అయిన మార్చి 26 న ఇంట్లో రెండు పుట్టిన రోజులు జరుపుకొంటామని వెల్లడించాడు✨.