దూకుడుగా ఆడాల్సి ఉంది: రైనా❗❗

  |   క్రికెట్

టి20 సిరీస్‌లో దూకుడైన ఆటతీరుతోనే ఆస్ట్రేలియాపై ఆధిపత్యం ప్రదర్శిస్తామని భారత బ్యాట్స్‌మన్ సురేశ్ రైనా వ్యాఖ్యానించాడు👍. ప్రత్యర్థితో పోలిస్తే తమ జట్టులో మంచి అనుభవం ఉందని, దేశవాళీ క్రికెట్ కారణంగా తనకు కూడా తగినంత మ్యాచ్ ప్రాక్టీస్ లభించిందని అతను అన్నాడు👆. ఆస్ట్రేలియా మైదానాల్లో బౌండరీలు అంత సులభంగా రావు కాబట్టి సింగిల్స్‌పై దృష్టి పెట్టాలన్న రైనా, ఫీల్డింగ్ కూడా మ్యాచ్ ఫలితాన్ని నిర్దేశిస్తుందన్నాడు☝.