న్యూజిలాండ్‌దే విజయం👍👍

  |   క్రికెట్

పాకిస్తాన్‌తో మూడు వన్డేల సిరీస్‌ను న్యూజిలాండ్ జట్టు విజయంతో ఆరంభించింది👍. ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ హెన్రీ నికోల్స్ (82; 7 ఫోర్లు) అర్ధ సెంచరీతో పాటు టెయిలెండర్ల అద్భుత బ్యాటింగ్‌తో సోమవారం జరిగిన తొలి వన్డేలో కివీస్ జట్టు పాక్‌పై 70 పరుగుల తేడాతో నెగ్గింది👌. తొలుత కివీస్ 50 ఓవర్లలో 8 వికెట్లకు 280 పరుగులు చేసింది☝. అనంతరం పాక్ 46 ఓవర్లలో 210 పరుగులు మాత్రమే చేయగలిగింది👆. బాబర్ (62; 6 ఫోర్లు) మాత్రమే మెరుగ్గా ఆడారు☝. బౌల్ట్‌కు నాలుగు, ఇలియట్‌కు మూడు వికెట్లు దక్కాయి☝.