ప‌వ‌న్ డిస్కౌంట్ ఇచ్చాడు.. బాకీ తీరిపోయింది❓❓

  |   Tollywood

నాన్న‌కు ప్రేమ‌తో సినిమా విడుద‌ల‌కు ఒక్క‌రోజు ముందు.. నిర్మాత బివిఎస్ఎన్ ప్ర‌సాద్‌కి గ‌ట్టి షాక్ ఇచ్చాడు ప‌వ‌న్ క‌ల్యాణ్‌💥. అత్తారింటికి దారేది స‌మ‌యంలో త‌నకు బాకీ ఉన్న రెండు కోట్ల రూపాయ‌ల లెక్క తేల్చాల‌ని, ఆ త‌ర‌వాతే.. సినిమాని విడుద‌ల చేసుకోవాల‌ని హుకుం జారీ చేశాడు💢. అప్ప‌టిక‌ప్పుడు ప‌వ‌న్‌ని బుజ్జ‌గించి త‌న సినిమాని విడుద‌ల చేయించుకొన్నాడు ఆ నిర్మాత‌😰. ఇప్పుడు నాన్న‌కు ప్రేమ‌తో కాస్త నిల‌బ‌డగ‌లిగింది.ప్ర‌సాద్ కూడా.. ప‌వ‌న్‌కి తాను ఇవ్వాల్సిన డ‌బ్బు తిరిగి ఇచ్చేశాడ‌ట‌👍. అయితే ముందుగా అనుకొన్న‌ట్టు రెండు కోట్లు కాదు👎. కోటిన్న‌రే. ప‌వ‌నే నిర్మాత ప‌రిస్థితి చూసి జాలి ప‌డ్డాడ‌ని, అందుకే అర‌కోటి రిబేట్ ఇచ్చాడ‌ని, బీవీఎస్ ఎన్ ప్ర‌సాద్ సింగిల్ పేమెంట్‌తో త‌న బాకీ తీర్చేసుకొన్నాడ‌ని టాక్‌☝. సో.. ఈ వ్య‌వ‌హారం ఇక్క‌డితో స‌ద్దుమ‌ణిగిన‌ట్టే☺.