'సరైనోడు' మూవీ స్టన్నింగ్ ఫస్ట్ లుక్ రీలీజ్👍👍

  |   Tollywood

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కథానాయకుడిగా... సక్సెస్ ఫుల్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో... సూపర్ డూపర్ హిట్స్ ని అందించిన ప్రతిష్టాత్మక గీతా ఆర్ట్స్ బ్యానర్లో... విజయవంతమైన చిత్రాలకు కేరాఆఫ్ అడ్రస్ గా నిలిచిన అల్లు అరవింద్ నిర్మాణంలో తెరకెక్కిస్తున్న చిత్రం సరైనోడు👍. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ లుక్ ను ఇటీవలే రిలీజ్ చేశారు👌. విభిన్నమైన ప్రమోషన్లో భాగంగా విడుదల చేసిన ఈ ప్రీ లుక్ పోస్టర్ కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది😂. ప్రీ లుక్ పోస్టర్స్ తో తెలుగు చిత్ర పరిశ్రమతో పాటు.. అల్లు అర్జున్ అభిమానుల్లో ప్రత్యేకమైన క్రేజ్ నెలకొంది. కండలు తిరిగిన చేతితో... హ్యాండిల్ తో కూడిన ఇనుప గుండును పట్టుకున్న ఈ పోస్టర్ తో అభిమానులు పండగ చేసుకున్నారు👏.