అడవుల్లో తిరుగుతున్న బాహుబలి❗❗

  |   Tollywood

బాహుబలి సినిమాకు సంబంధించిన ప్రతి వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారుతోంది😍. ముఖ్యంగా తొలి భాగం సాధించిన విజయంతో బాహుబలి 2 పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి👍. అందుకు తగ్గట్టుగానే రాజమౌళి టీం నుంచి సినిమాకు సంబంధించి వార్తలు వస్తున్నాయి💨. బాహుబలిని మరిపించే స్ధాయిలో బాహుబలి 2 తెరకెక్కుతుందని ఇప్పటికే ప్రకటించారు చిత్రయూనిట్👌. తాజాగా అడవుల్లో, ప్రభాస్ షూటింగ్లో పాల్గొంటున్న ఫోటో ఒకటి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది⚡. సినిమాకు సంబందించి ఎలాంటి విషయం బయటికి రాకుండా రాజమౌళి జాగ్రత్తలు తీసుకుంటున్నా, ఇలా ఏదో ఒక ఫోటో బయటికి వస్తూనే ఉంది☝. నిజంగానే ఈ ఫోటో లీక్ అయ్యిందో లేక యూనిట్ సభ్యులే లీక్ చేశారో తెలీదుగానీ, ప్రభాస్ అభిమానులు మాత్రం పండగ చేసుకుంటున్నారు😂. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న బాహుబలి 2 సినిమాను ఈ ఏడాది చివరలోగాని, వచ్చే ఏడాది మొదట్లోగాని రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు👌.