ఆ విషయమే నాకు తెలియదు: రాజమౌళి❓❓

  |   Tollywood

గణతంత్ర దినోత్సవం సందర్భంగా పద్మ అవార్డులు ప్రకటించిన ప్రభుత్వం తెలుగు సినీరంగం నుంచి రాజమౌళిని పద్మ శ్రీ పురస్కారానికి ఎంపిక చేసింది👍. బాహుబలి సినిమాతో తెలుగు సినిమాను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లినందుకు గాను ప్రభుత్వం ఈ దర్శక ధీరుణ్ని అత్యుతన్నత పురస్కారంతో గౌరవించింది👏. ఇప్పటికే ఈ గౌరవానికి తాను అర్హుడిని కాదంటూ ప్రకటించిన రాజమౌళి, మరిన్ని విషయాలను అభిమానులతో పంచుకున్నాడు☝.' గత ఏడాది ఆంద్ర ప్రదేశ్ ప్రభుత్వం పద్మ అవార్డుకు నా పేరును పంపాలని నన్ను సంప్రదించింది👆. నేను కాదన్నాను🙅. ప్రభుత్వం నాపై చాలా ఒత్తిడి తీసుకువచ్చింది👆. అయితే నేను రిక్వెస్ట్ చేయటంతో ఆంద్ర ప్రదేశ్ ప్రభుత్వం పద్మ అవార్డుకు నా పేరును ఎంపిక చేయలేదు👆. కానీ ఈ సారి మాత్రం నన్ను సంప్రదించకుండానే నా పేరును అవార్డు కమిటీకి పంపారు👍. ఈ పని ఎవరు చేశారా అని ఆరా తీస్తే, కర్ణాటక ప్రభుత్వం నా పేరును అవార్డుకు పంపినట్టుగా తెలిసింది☝. నేను పుట్టింది కర్ణాటకలో, చదువుకుంది ఆంద్ర ప్రదేశ్ లో, పని చేసింది తమిళనాట, ప్రస్తుతం ఉంటున్నది తెలంగాణలో ఇన్ని రాష్ట్రాలతో అనుబందం ఉన్నందుకు ఆనందంగా ఉంది' అంటూ అభిమానులతో ఈ విషయాన్ని పంచుకున్నాడు రాజమౌళి😂.