టాక్ ఆఫ్ ది టౌన్ తమన్నా సెల్ఫీలు✨✨

  |   Tollywood

మిల్కీ బ్యూటీ తమన్నాతో సెల్ఫీ దిగాలని అనుకోని సినీ అభిమానులు ఉండరేమో..కానీ తమన్నా మాత్రం నాగార్జున,మహేష్ బాబులతో్ సెల్ఫీ దిగి టాక్ ఆఫ్ ది టౌన్ అయింది👍. తారల తళుకుబెళుకులతో, అద్భుతంగా రెండ్రోజుల పాటు సాగిన ఐఫాలో,రామ్ చరణ్, తమన్నా, అఖిల్ లాంటి స్టార్స్ అందరూ స్టేజ్ పై డ్యాన్స్ లతో అలరించారు👯. ' ధీవర ' పాటను అభినయిస్తూ,దేవకన్యలా స్టేజ్ పైకి దిగిన తమన్నా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది💃. ఆమె అందాన్ని, అభినయాన్ని చూడటానికి అక్కడికొచ్చిన వారికి రెండు కళ్లూ చాలలేదు. చివరిపాటగా 'సెల్ఫీ పుళ్లా' సాంగ్ కు స్పెప్పులు వేసిన తర్వాత, పనిలో పనిగా కిందికి దిగి, నాగార్జునతోనూ, మహేష్ బాబుతోనూ సెల్ఫీలు దిగి అందర్నీ ఆశ్చర్యపరిచింది😶. అది కూడా డ్యాన్స్ లో ఒక భాగమే.👌.