టీమిండియా చేతిలో ఆసీస్ చిత్తు👎

  |   క్రికెట్

ఆస్ట్రేలియాతో మూడు మ్యాచ్ ల ట్వంటీ 20 సిరీస్ లో టీమిండియా బోణి చేసింది👍. మంగళవారం ఇక్కడ జరిగిన తొలి ట్వంటీ20లో టీమిండియా 37 పరుగుల తేడాతో విజయం సాధించింది👏. భారత్ విసిరిన 189 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్ ఆరంభించిన ఆసీస్ 19.3 ఓవర్లలో 151 పరుగులకే చాపచుట్టేసి ఘోర ఓటమి పాలైంది👎. కెప్టెన్ ఆరోన్ ఫించ్(44) ఫర్వాలేదనిపించగా, స్టీవ్ స్మిత్(21), డేవిడ్ వార్నర్(17), షేన్ వాట్సన్(12), ట్రావిస్ హెడ్(2), వేడ్(5), ఫాల్కనర్ (10)లు తీవ్రంగా నిరాశపరచడంతో ఆసీస్ చిత్తుగా ఓడింది👎.