నేటి నుంచి అండర్-19 ప్రపంచకప్👍👍

  |   క్రికెట్

ఓవైపు ఉరకలెత్తే ఉత్సాహం... మరోవైపు గెలవాలన్న కసి... వెరసి అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న కుర్రాళ్ల క్రికెట్ పండగకు బంగ్లాదేశ్‌లో రంగం సిద్ధమైంది👍. నేటి నుంచి బంగ్లాదేశ్‌లో అండర్-19 ప్రపంచకప్ జరగనుంది👍. మొత్తం 16 జట్లు నాలుగు గ్రూప్‌లుగా విడిపోయి తలపడుతున్నాయి🙌. ఫిబ్రవరి 14 వరకు ఈ టోర్నీ జరుగుతుంది. టైటిల్ ఫేవరెట్‌గా బరిలోకి దిగుతున్న మాజీ చాంపియన్ భారత్... గ్రూప్ ‘డి’లో ఐర్లాండ్, నేపాల్, న్యూజిలాండ్‌లను ఎదుర్కొంటుంది☝. గ్రూప్ ‘సి’లో ఇంగ్లండ్, ఫిజి, వెస్టిండీస్, జింబాబ్వే; గ్రూప్ ‘బి’లో అఫ్ఘానిస్తాన్, కెనడా, పాకిస్తాన్, శ్రీలంక; గ్రూప్ ‘ఎ’లో ఆతిథ్య బంగ్లాదేశ్, నమీబియా, డిఫెండింగ్ చాంపియన్ దక్షిణాఫ్రికా, స్కాట్లాండ్ ఉన్నాయి👆. భద్రతాకారణాలరీత్యా ఆస్ట్రేలియా జట్టు ఈ మెగా ఈవెంట్ నుంచి వైదొలిగింది👎. తొలి రోజున బంగ్లాదేశ్‌తో దక్షిణాఫ్రికా; ఫిజీతో ఇంగ్లండ్ ఆడనున్నాయి👌.