మామ, అల్లుళ్ల సవాల్❗❗

  |   Tollywood

సంక్రాంతికి బాబాయ్, అబ్బాయ్‌లు బరిలో దిగగా, సమ్మర్లో కూడా ఇలాంటి రసవత్తర పోటీకి రెడీ అవుతోంది తెలుగు వెండితెర👍. పండగ పూట బాలకృష్ణ, ఎన్టీఆర్‌లు ఢీ అంటే ఢీ అన్నారు🙌. అదే జోరులో వేసవి సెలవులకు అల్లు అర్జున్, పవన్ కళ్యాణ్‌లు తలపడటానికి రెడీ అవుతున్నారు🙌. ప్రస్తుతం ఈ ఇద్దరు స్టార్ హీరోలు చేస్తున్న సినిమాలు దాదాపు పూర్తి కావచ్చాయి☝. దీంతో నిర్మాణాంతర కార్యక్రమాలు పూర్తి చేసి ఒకే సమయంలో రిలీజ్ చేయడానికి రెడీ అవుతున్నారు నిర్మాతలు.లాంగ్ గ్యాప్ తరువాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, గబ్బర్‌సింగ్‌కు సీక్వెల్‌గా తెరకెక్కుతున్న సర్థార్ గబ్బర్‌సింగ్ సినిమాలో నటిస్తున్నాడు👋. సన్నాఫ్ సత్యమూర్తి సినిమా తరువాత బన్నీ కూడా గ్యాప్ తీసుకొని బోయపాటి దర్శకత్వంలో సరైనోడు సినిమాలో నటిస్తున్నాడు👆. ఈ రెండు సినిమాలు పక్కా మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్లు కావటంతో ఎవరిది పైచేయి అవుతుందో, అని అభిమానులతో పాటు ఇండస్ట్రీ వర్గాలు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు😍.