హార్దిక్ పాండ్యాపై ధోని ప్రశంసలు👏👏

  |   క్రికెట్

ఆస్ట్రేలియాతో జరిగిన తొలి ట్వంటీ 20 ద్వారా అంతర్జాతీయ క్రికెట్ లో ఆరంగేట్రం చేసిన టీమిండియా ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యాపై కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ప్రశంసల వర్షం కురిపించాడు👏. ఆస్ట్రేలియా ఎదురుదాడికి దిగినప్పుడు పాండ్యా యార్కర్లతో వారిని కట్టడి చేసిన విధానం నిజంగా అద్భుతమన్నాడు👍. ఇదే తరహా నిలకడను కొనసాగిస్తే మాత్రం పాండ్యాకు కచ్చితంగా మంచి భవిష్యత్తు ఉంటుందని ధోని పేర్కొన్నాడు☝. మూడు ఓవర్లలో 37 పరుగులిచ్చి రెండు వికెట్లు తీసిన పాండ్యా మొదటి మ్యాచ్ లోనే రాణించడం టీమిండియాకు శుభపరిణామన్నాడు👌. ఓవరాల్ గా ఆసీస్ పై చక్కటి బౌలింగ్ వేయడం వల్లే విజయం సాధ్యమైందన్నాడు👍. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన తమకు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, సురేష్ రైనాలు బాధ్యతాయుతంగా ఆడి భారీ స్కోరు సాధించడంలో సహకరించారన్నాడు💦.