101 పరుగులకే కుప్పకూలిన ఇంగ్లండ్👎👎

  |   క్రికెట్

దక్షిణాఫ్రికాతో జరిగిన ఆఖరి టెస్టులో ఇంగ్లండ్ కు షాక్ తగిలింది💥. దక్షిణాఫ్రికా విసిరిన 382 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో తడబడిన ఇంగ్లండ్ తన రెండో ఇన్నింగ్స్ ను 101 పరుగుల వద్ద ముగించి ఘోర ఓటమి పాలైంది👎. 52/3 ఓవర్ నైట్ స్కోరుతో మంగళవారం చివరి రోజు ఆటను కొనసాగించిన ఇంగ్లండ్ మరో 49 పరుగులు మాత్రమే జోడించి మిగతా ఏడు వికెట్లను నష్టపోయింది👇. దక్షిణాఫ్రికా బౌలర్ రబడా ఆరు వికెట్లు తీసి ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్ ను కుప్పకూల్చాడు👎. అతనికి జతగా మోర్నీ మోర్కెల్ మూడు వికెట్లతో రాణించగా, పీడ్త్ కు ఒక వికెట్ దక్కింది☝. తొలి, మూడు టెస్టులను గెలిచిన ఇంగ్లండ్ సిరీస్ సాధించగా, నాల్గో టెస్టులో మాత్రమే దక్షిణాఫ్రికా విజయం సాధించింది👍.