చిరంజీవి 150వ సినిమాకు కొత్త అడ్డంకులు?❓❓

  |   Tollywood

మెగా ఫ్యామిలీ ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న చిరంజీవి రీ ఎంట్రీ సినిమాకు కొత్త అడ్డంకులు ఎదురవుతున్నాయి👎. చాలా రోజులుగా రీ ఎంట్రీ సినిమాపై కసరత్తులు చేస్తున్న చిరంజీవి, ఇటీవలే తమిళ సూపర్ హిట్ సినిమా 'కత్తి'ని రీమేక్ చేయాలని నిర్ణయించారు👍. వివి వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమా ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది😰. మెగా తనయుడు రామ్ చరణ్, లైకా ప్రొడక్షన్స్తో కలిసి ఈ భారీ చిత్రాన్ని నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నాడు👌.అయితే ఇంకా పట్టాలెక్కని ఈ సినిమా నిర్మాణంపై కథా హక్కుల వేదిక ఆంక్షలు విధించింది☝. కత్తి కథ తనదేనంటూ రచయిత ఎన్ నరసింహారావు పోరాడుతుండటంతో ఆయనకు న్యాయం చేసిన తరువాతే సినిమా నిర్మాణం చేపట్టాలని కథా హక్కుల వేదిక చైర్మన్ దాసరి నారాయణరావు తీర్మానించారు👆. అప్పటివరకు దర్శకుల సంఘం, సినీ కార్మికుల ఫెడరేషన్ సహాయ నిరాకరణ చేయడానికి నిర్ణయించారు👇.