పవన్‌ను దాటేసిన జూనియర్✨✨

  |   Tollywood

ఒకప్పుడు సినిమా సక్సెస్‌ను ఎన్ని రోజులు ఆడింది అన్న దాన్ని బట్టి చెప్పేవారు☝. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది👆. స్టార్ హీరోల సినిమాలు కూడా 15 రోజులకు మించి థియేటర్లలో ఉండే పరిస్థితి లేదు😥. దీంతో సినిమా సక్సెస్‌ను కలెక్షన్లతో లెక్కవేస్తున్నారు☝. ముఖ్యంగా స్టార్ హీరోల మధ్య ఈ కలెక్షన్ల రికార్డ్ల పోటి ఎక్కువగా కనిపిస్తోంది👍. ఇప్పటికే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సెట్ చేసిన ఓ రికార్డ్‌ను యంగ్ టైగర్ ఎన్టీఆర్ బ్రేక్ చేశాడు👊. ప్రస్తుతం ఉన్న ట్రెండ్‌లో ఓవర్సీస్లో సాధిస్తున్న కలెక్షన్లు సినిమా సక్సెస్ మీద ఎక్కువగా ప్రభావం చూపిస్తున్నాయి☝. అందుకే స్టార్ హీరోలందరూ ఓవర్సీస్లో మిలియన్ మార్క్ కలెక్షన్ల కోసం ఆరాటపడుతున్నారు👍. ఈ లిస్ట్‌లో భారీ వసూళ్లతో బాహుబలి నెంబర్ వన్ స్థానంలో ఉండగా, మహేష్ శ్రీమంతుడు రెండో స్థానంలో ఉంది. ఇక మొన్నటి వరకు పవన్ అత్తారింటికి దారేది మూడో స్థానంలో ఉండగా, తాజాగా ఎన్టీఆర్ నాన్నకు ప్రేమతో సినిమాతో ఆ పవన్ కలెక్షన్ రికార్డ్‌ను అధిగమించాడు👌.