వన్డే, టి20ల్లో చక్కటి ప్రదర్శన బుమ్రా...✨

  |   క్రికెట్

అదృష్టమంటే అలా ఉండాలి... వీడు సుడిగాడురా అనిపించాలి...పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా అంతర్జాతీయ అరంగేట్రం అలాగే అచ్చు సినిమా స్టోరీలా జరిగింది👌. టి20 జట్టులోకి ఎంపికైన అతను మ్యాచ్ కోసం అడిలైడ్ వెళ్లాల్సి ఉంది☝. తనతో పాటే వెళ్లాల్సిన ఐదుగురు భారత ఆటగాళ్లకు ఫ్లయిట్ ఖరారు కాగా... బుమ్రాకు మాత్రం టిక్కెట్ దొరకలేదు👎. దీంతో బీసీసీఐ అతడిని సిడ్నీకి పంపించింది☝. ఆఖరి వన్డే కోసం సిడ్నీలోనే భారత జట్టు ఉండటం... భువనేశ్వర్‌కు గాయం కావడంతో... అనూహ్యంగా ధోని... బుమ్రాను ఆడించాడు👍. ఆ మ్యాచ్‌లో చెలరేగిన ఈ యువ పేసర్... టి20లోనూ కంగారూలకు చుక్కలు చూపించాడు👏. ఫలితంగా కేవలం రెండే మ్యాచ్‌ల్లో భారత క్రికెట్‌లో కొత్త సంచలనంగా మారాడు⭐.