పదేళ్ల జైలు.....విరాట్ కోహ్లీ వీరాభిమాని ఉమర్ ద్రాజ్😞😞

  |   క్రికెట్

పాకిస్తాన్‌లో భారతజాతీయ జెండా ఎగరేసినందుకు ఉమర్ ద్రాజ్ అనే వ్యక్తికి పాక్‌కోర్టు పదేళ్ల జైలు శిక్ష విధించింది☝. భారత క్రికెటర్ విరాట్ కోహ్లీ వీరాభిమానైన ఉమర్ జనవరి 26న భారత్-ఆస్ట్రేలియా మధ్య జరిగిన టీ-20 మ్యాచ్‌లో కోహ్లీ 90 పరుగు లు చేయటంతో భారత జాతీయ పతాకాన్ని ఎగరేశాడు👆. దీంతో పాక్ పోలీసులు ఉమర్‌పై కేసుపెట్టారు☝. దీన్ని విచారించిన కోర్టు గురువారం ఉమర్‌కు పదేళ్ల జైలుశిక్ష విధించింది. కోర్టుకు వస్తున్న సందర్భంగా ఉమర్ మాట్లాడుతూ.. తాను విరాట్ కోహ్లీని.. భారత క్రికెట్ జట్టును అభిమానిస్తానని తెలిపాడు👍.