మహేష్‌పై నిప్పులు చెరుగుతున్న గ్రామస్థులు😡😡

  |   Tollywood

సూపర్ స్టార్ మహేష్ శ్రీమంతుడు చిత్రం తర్వాత రెండు గ్రామాలను దత్తత తీసుకోగా, ఆ గ్రామస్థులు మహేష్‌పై చాలా ఆగ్రహంగా ఉన్నట్టు తెలుస్తోంది💢. గతంలో సిద్ధాపూర్ గ్రామాన్ని దత్తత తీసుకున్న మహేష్ ఆ గ్రామానికి రావడం కాని, కనీసం వారి బాగోగులు కూడా పట్టించుకోవడం లేదని సిద్దాపూర్ గ్రామస్థులు ఆయనపై మండిపడుతున్నట్టు సమాచారం😡.మహేష్ బాబు సిద్ధాపూర్ గ్రామాన్ని అభివృద్ది చేసేందుకు తన టీంతో కొన్ని ప్రణాళికలు చేసినట్టు అప్పట్లోనే వార్తలు వచ్చాయి👍. అయితే ఆ ప్రణాళికలు ఇంకా అమలు కాకపోవడంలో గ్రామస్థులు తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నట్టు టాక్😫.