సమంతకు భయపడుతున్న ఎన్టీఆర్..?😨😨

  |   Tollywood

టెంపర్, నాన్నకు ప్రేమతో సినిమాలతో వరుస సూపర్ హిట్లు సాధించిన ఎన్టీఆర్, నెక్ట్స్ ప్రాజెక్ట్ విషయంలో జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకుంటున్నాడు😅. ఇప్పటికే కొరటాల శివ దర్శకత్వంలో 'జనతా గ్యారేజ్' సినిమా చేస్తున్నట్టుగా ప్రకటించిన జూనియర్, ప్రస్తుతం ఆ సినిమాకు నటీనటుల ఎంపికలో బిజీగా ఉన్నాడు💦. ఇద్దరు హీరోయిన్లు నటించనున్న ఈ సినిమాలో ఒక హీరోయిన్గా నిత్యామీనన్ను ఎంపిక చేయటంతో మాలీవుడ్లో కూడా జనతా గ్యారేజ్కు మంచి క్రేజ్ ఏర్పాడుతోంది👍. ముందుగా లీడ్ హీరోయిన్గా సమంతను ఫైనల్ చేసిన చిత్రయూనిట్, ఇప్పుడు మరోసారి ఆలోచనలో పడింది😕. గతంలో ఎన్టీఆర్, సమంత కాంబినేషన్లో బృందావనం, రామయ్యా వస్తావయ్య, రభస సినిమాలు వచ్చాయి👍. అయితే వీటిలో బృందావనం ఒక్కటే మంచి టాక్ సొంతం చేసుకోగా మిగతా రెండు సినిమాలు భారీ డిజాస్టర్లుగా నిలిచాయి☝. అందుకే సమంతతో సినిమా చేస్తే రిజల్ట్ ఎలా ఉంటుందో అన్న అనుమానం వ్యక్తం చేస్తున్నారు😕.