సిరీస్పై కన్నేసిన ధోని సేన👍👍

  |   క్రికెట్

మూడు మ్యాచ్ లో సిరీస్ లో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన తొలి ట్వంటీ20లో గెలిచిన మహేంద్ర సింగ్ ధోని నేతృత్వంలోని టీమిండియా మరోసారి అదే ఫలితాన్ని పునరావృతం చేయాలని భావిస్తోంది👍. వన్డేల్లో ఎదురైన ఘోర పరాభావాన్ని వెనక్కి నెట్టాలంటే ట్వంటీ 20 సిరీస్ ను ముందుగా ముగించడమే టీమిండియా లక్ష్యంగా కనబడుతోంది💦. శుక్రవారం ఇరు జట్ల మధ్య రెండో ట్వంటీ 20 మ్యాచ్ జరుగనుంది☝. త్వరలో భారత్ లో జరిగే ట్వంటీ20 వరల్డ్ కప్ కు ఫేవరెట్ గా బరిలోకి దిగాలంటే మాత్రం కచ్చితంగా ఆసీస్ ను టీమిండియా ఘోరంగా ఓడాల్సి ఉంది👎. మరోపక్క వన్డే సిరీస్ లో టీమిండియా 1-4 తేడాతో ఓటమి పాలుకావడంతో టీమిండియాపై తీవ్రస్థాయిలో విమర్శలు చోటు చేసుకున్నాయి👆. ఈ సిరీస్ లో విజయం ద్వారా వాటికి సమాధానం చెప్పాలని ధోని అండ్ గ్యాంగ్ యోచిస్తోంది👊.