హార్దిక్ పాండ్యాకు మందలింపు❗❗

  |   క్రికెట్

తొలి అంతర్జాతీయ మ్యాచ్‌లోనే భారత ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా ఐసీసీ హెచ్చరికకు గురయ్యాడు💢. అడిలైడ్ టి20లో క్రిస్ లిన్‌ను అవుట్ చేసిన అనంతరం పాండ్యా అమితోత్సాహంతో సంబరాలు చేసుకున్నాడు✨. ఈ క్రమంలో అతను బ్యాట్స్‌మెన్‌కు దగ్గరగా వచ్చి రెచ్చగొట్టేలా ప్రవర్తించాడు💢. ఐసీసీ ఆర్టికల్ 2.1.7 ప్రకారం ఇలా చేయడం నిబంధనలకు విరుద్ధం👇. మొదటి తప్పు కావడంతో ఈ సారి హెచ్చరికతో సరిపెడుతున్నట్లు రిఫరీ జెఫ్‌క్రో ప్రకటించారు☝.