బ్ర‌హ్మానందం.. కాళ్ల‌బేరం😢

  |   Tollywood

ఒక‌ప్పుడు బ్ర‌హ్మానందం లేకుండా తెలుగు సినిమా ఉండేది కాదు😉. ర‌క‌ర‌కాల పాత్ర‌ల‌తో, త‌న న‌వ్వుల‌తో, కామెడీ పంచుల‌తో ఎన్నో సినిమాల్ని త‌న భుజ‌స్కంధాల‌పై వేసుకొని న‌డిపించేశాడు🏃. కాలం గిర్రున తిరిగింది... కొత్త హాస్య‌న‌టుడ‌ల హ‌వా మొద‌లైంది😂. దాంతో బ్ర‌హ్మానందం స్థానం మారింది. ఇప్పుడు అవ‌కాశాల కోసం బ్ర‌హ్మీ ప‌డ‌రాని పాట్లు ప‌డుతున్నాడు😰. అందుకే ద‌ర్శ‌కుల‌కు ఫోన్లు చేసి నా కోసం మంచి పాత్ర‌లు సిద్ధం చేయండి.. అంటూ నోరు విడ‌చి అడుగుతున్నాడ‌ట‌😟.త‌న బిహేవెర్‌తో చాలామంది ద‌ర్శ‌కుల మ‌న‌సు నొప్పించాడు బ్ర‌హ్మానందం😫.. వాళ్లంతా ఇప్పుడు బ్ర‌హ్మీని దూరం పెట్టాల‌ని నిర్ణ‌యించుకొన్నార‌ట‌😞. కొంత‌మంది బ‌డా నిర్మాత‌లు సైతం బ్ర‌హ్మానందాన్ని తీసుకోవొద్దు అని మొహంమీదే చెప్పేస్తున్నార్ట‌. దాంతో... బ్ర‌హ్మీకి అవ‌కాశాలు క‌ర‌వ‌య్యాయ‌ని... అందుకే ఇప్పుడు సినిమాల కోసం కాళ్ల‌బేరానికి దిగిపోయాడ‌ని చెప్పుకొంటున్నారు🙏. పాపం.. ఓడ‌లు బ‌ళ్ల‌వ్వ‌డం అంటే ఇదే👍.