'చీకటిలోనూ కోహ్లీ మెరుపులు చిమ్మగలడు' సునీల్ గవస్కర్ 👍👍

  |   క్రికెట్

భారత డాషింగ్ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లి సూపర్ ఫాం కొనసాగిస్తుండటంపై క్రికెట్ దిగ్గజం సునీల్ గవస్కర్ ప్రశంసల వర్షం కురిపించారు👏. అర్ధరాత్రి విద్యుత్ దీపాలు లేకున్నా కోహ్లి బ్యాటింగ్ చేసి.. పరుగులు రాబట్టగలడని, అంతటి ఫాంను అతను కొనసాగిస్తున్నాడని గవస్కర్ అన్నారు👌.ఆస్ట్రేలియా పర్యటనలో ట్వంటీ-20లో కోహ్లి చెలరేగి ఆడుతున్న సంగతి తెలిసిందే☝. వరుసగా రెండో టీ-20 మ్యాచ్‌లోనూ కోహ్లి మెరుపు హాఫ్ సెంచరీ బాది టీమిండియా విజయానికి బాటలు వేశాడు👍. ఈ నేపథ్యంలో గవస్కర్ మాట్లాడుతూ 'భావి ఆటగాళ్ల కోసం కోహ్లి ఉన్నత ప్రమాణాలు నెలకొల్పుతున్నాడు👆. అతను అద్భుతమైన ఫాంలో ఉన్నాడు🌟. ఆటగాళ్లు కలలు కనే ఫాంను అతను కొనసాగిస్తున్నాడు👍. అతను అర్ధరాత్రి లైట్లు లేకున్నా బాగా ఆడగలడు✨.