చరిత్ర సృష్టించారు!✨✨

  |   క్రికెట్

భారత మహిళల క్రికెట్ జట్టు ఆస్ట్రేలియా గడ్డపై చరిత్ర సృష్టించింది👍. తొలిసారిగా టి20 సిరీస్ కైవసం చేసుకుంది👌. ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టి20లో మిథాలీ రాజ్ సేన 10 వికెట్ల తేడాతో విజయం సాధించింది👍. మూడు టి20ల సిరీస్‌లో 2-0 ఆధిక్యంలో నిలిచి టైటిల్ గెలిచింది. మూడో మ్యాచ్ ఈ నెల 31న సిడ్నీలో జరుగుతుంది☝. టాస్ ఓడిపోయి ఇండియా ఫీల్డింగ్ ఎంచుకోవడంతో ఆస్ట్రేలియా ముందుగా బ్యాటింగ్ చేసింది👆. వర్షం అంతరాయం కలిగించడంతో మ్యాచ్ ను 18 ఓవర్లకు కుదించారు. ఆసీస్ 18 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 125 పరుగులు చేసింది👍. డీఎల్ఎఫ్ విధానంలో భారత్ కు 10 ఓవర్లలో 66 పరుగుల టార్గెట్ నిర్దేశించారు. భారత్ వికెట్ నష్టపోకుండా లక్ష్యాన్ని చేరుకుంది👏. 9.1 ఓవర్లలో 69 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది👏. మిథాలీ రాజ్ 37, మంధన 22 పరుగులుతో అజేయంగా నిలిచారు☝. రెండు కీలక వికెట్లు పడగొట్టిన ఝులన్ గోస్వామికి 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' దక్కింది👍.