చిరు - ప‌వ‌న్‌.... ఒకేపాట‌లో?!🎉🎉

  |   Tollywood

స‌ర్దార్ సెట్లో చిరంజీవి అడుగుపెట్ట‌డం హాట్ టాపిక్‌గా మారింది😍. `అన్న‌ద‌మ్ములు క‌ల‌యిక కొత్త ప్ర‌శ్న‌ల‌కు, సందేహాల‌కు, కాంబినేష్ల‌కు దారిచ్చింది👍. చిరు, ప‌వ‌న్‌ల మ‌ధ్య రాజ‌కీయప‌ర‌మైన అంశాలు ప్ర‌స్తావ‌న‌కు వ‌చ్చిన‌ట్టు చెప్పుకొంటున్నారు☝. క‌త్తి సినిమా రీమేక్‌పై చిరుని ప‌వ‌న్‌.. కొన్ని వివ‌రాలు అడిగి తెలుసుకొన్నాడ‌ట‌👆. అన్నింటికంటే ముఖ్యంగా.. స‌ర్దార్ సినిమాలో అన్న‌ద‌మ్ములిద్ద‌రూ క‌ల‌సి ఓ పాటలో చిందేస్తున్నార‌న్న‌ది ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యింది👌. ఇది వ‌ర‌కు శంక‌ర్ దాదా ఎంబీబీఎస్‌, శంక‌ర్ దాదా జిందాబాద్‌ల‌లో ప‌వ‌న్ క‌నిపించాడు👍. అయితే ఒక్క‌సారి కూడా ప‌వ‌న్ సినిమాలో చిరు సందడి చేయ‌లేదు☝. ఆలోటు,. స‌ర్దార్ తో తీర‌బోతోంద‌న్న‌మాట‌👏. స‌ర్దార్ కోసం దేవిశ్రీ ప్ర‌సాద్ స్పెష‌ల్ గా ఓ ఐటెమ్ సాంగ్ కంపోజ్ చేశాడు🎵. ఆ పాట‌లోనే చిరు, ప‌వ‌న్ క‌ల‌సి స్టెప్పులేస్తార‌ట‌👯.