దక్షిణాఫ్రికా టెస్టు కెప్టెన్గా ఏబీ❗❗

  |   క్రికెట్

దక్షిణాఫ్రికా టెస్టు కెప్టెన్ గా స్టార్ ఆటగాడు ఏబీ డివిలియర్స్ నియమించబడ్డాడు👍. ఈ మేరకు ఏబీని టెస్టు కెప్టెన్ గా నియమిస్తున్నట్టు క్రికెట్ సౌతాఫ్రికా(సీఎస్ఏ) తాజాగా స్పష్టం చేసింది☝. ఇటీవల ఇంగ్లండ్ తో జరిగిన చివరి రెండు టెస్టులకు హషీమ్ ఆమ్లా కెప్టెన్సీ నుంచి వైదొలగడం తో ఆ బాధ్యతను తాత్కాలికంగా డివిలియర్స్ కు అప్పగించిన సంగతి తెలిసిందే👆. కాగా, జాతీయ సెలక్టర్లు అభిప్రాయంతో ఏబీని టెస్టు కెప్టెన్ గా నియమిస్తూ దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు నిర్ణయం తీసుకుంది👍. ఇప్పటికే వన్డే సారథిగా ఉన్నా ఏబీని టెస్టు కెప్టెన్ గా నియమించడం పట్ల సీఎస్ఎ చీఫ్ ఎగ్జిక్యూటివ్ హారూన్ లోర్గాట్ హర్షం వ్యక్తం చేశారు😄.