ధోనికి సుప్రీంకోర్టులో ఊరట❗❗

  |   క్రికెట్

టీమిండియా వన్డే కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది☺. వివాదస్పద ప్రకటన కేసులో అతడిపై అనంతపురం కోర్టు చేపట్టిన విచారణపై స్టే విధించింది😨. ఈ కేసు విచారణను అనంతపురం నుంచి బెంగళూరు కోర్టుకు తరలించాలని ధోని పెట్టుకున్న విజ్ఞాపనపై అభిప్రాయం తెలపాలని ఆంధ్రప్రదేశ్ పోలీసులను సుప్రీంకోర్టు కోరింది👆. తమ ఎదుట హాజరుకావాలని అనంతపురం కోర్టు సమన్లు జారీ చేసింది☝. ధోని స్పందించకపోవడంతో ఫిబ్రవరి 25లోపు కచ్చితంగా కోర్టులో హాజరు కావాలని, లేకుంటే అరెస్టు తప్పదని ఇటీవల హెచ్చరించింది☝.