ధోని సేనదే సిరీస్👏👏👍👍

  |   క్రికెట్

ఆస్ట్రేలియాతో జరిగిన రెండో ట్వంటీ20లోనూ సమష్టిగా పోరాడిన టీమిండియా సిరీస్ ను చేజిక్కించుకుంది👍. తొలుత బ్యాటింగ్ లో ఆకట్టుకున్న టీమిండియా..ఆపై బౌలింగ్, ఫీల్డింగ్ లో కూడా రాణించి 27 పరుగుల తేడాతో విజయాన్ని సొంతం చేసుకుంది👌. టీమిండియా నిర్దేశించిన 185 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో బ్యాటింగ్ చేపట్టిన ఆసీస్ 157 పరుగులకే పరిమితమై ఓటమి పాలైంది👎. దీంతో టీమిండియా 2-0 తేడాతో సిరీస్ ను సాధించింది. ఆసీస్ ఆటగాళ్లలో కెప్టెన్ ఆరోన్ ఫించ్(74;48 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సర్లు) మినహా ఎవరూ రాణించకపోవడంతో ఓటమి తప్పలేదు☝. షాన్ మార్ష్(23),లాయన్(2), మ్యాక్స్ వెల్(1) , షేన్ వాట్సన్(15), ఫాల్కనర్(10)లు నిరాశపరిచారు👆. తొలి వికెట్ కు 94 పరుగులు జోడించిన ఆసీస్.. ఆ తరువాత వరుసగా వికెట్లను చేజార్చుకుని ఓటమి పాలైంది👎. టీమిండియా బౌలర్లలో రవీంద్ర జడేజా , బూమ్రాలకు చెరో రెండు వికెట్లు దక్కగా, అశ్విన్, పాండ్యా, యువరాజ్ సింగ్ లకు తలో వికెట్ దక్కింది👍.