ఫిబ్రవరిలో పెళ్లి పీటలెక్కనున్న ఇర్ఫాన్ పఠాన్✨✨

  |   క్రికెట్

భారత క్రికెటర్లు హర్భజన్ సింగ్, రోహిత్ శర్మ ఇటీవలే ఒక ఇంటివారైన సంగతి తెలిసిందే👍. ఇప్పుడు వారి సరసన క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ కూడా చేరనున్నాడు☝. భారత క్రికెటర్లలో ఎలిజిబుల్ బ్యాచ్‌లర్‌లలో ఒకడైన ఇర్ఫాన్ ఫిబ్రవరిలో పెళ్లి చేసుకోనున్నట్లు తెలుస్తోంది👌. ఇప్పటి వరకు ఇర్ఫాన్ తన వ్యక్తిగత విషయాల గురించి మీడియాతో ప్రస్తావించలేదు👎. అయితే, ఈ మధ్య పెళ్లి గురించి వార్తలు వెలువడుతుండడంతో ఆఖరికి ఇర్ఫాన్ నోరు విప్పాడు👍. ఫిబ్రవరిలో పెళ్లి చేసుకుంటున్న విషయం నిజమేనని, మిగతా వివరాలు త్వరలో వెల్లడిస్తానని అతను తెలిపాడు👋. పెళ్లి వేడుకలు చాలా ఘనంగా జరగనున్నట్లు, వధువుతో పాటు ఇర్ఫాన్ చెల్లెలికి కూడా సూరత్ నుంచి ఆభరణాలు డిజైన్ చేయిస్తున్నట్లు ఇర్ఫాన్ సన్నిహితులు తెలియజేశారు☺.