ఫిబ్రవరి 12న గరం..గరం విడుదల✨✨

  |   Tollywood

శ్రీనివాస సాయి స్క్రీన్స్ పతాకంపై మదన్ దర్శకత్వంలో ఆది, ఆదాశర్మ జంటగా పి.సురేఖ రూపొందించిన ‘గరం’ అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని ఫిబ్రవరి 12న విడుదలకు సిద్ధమైంది👍. ఈ సంవత్సరం మంచి హిట్స్‌తో మొదలైందని, ఈ సినిమా కూడా అదే బాటలో పయనించాలని, పాటలకు మంచి రెస్పాన్స్ లభిస్తోందని నరేష్ తెలిపారు✌. క్లైమాక్స్ హైలెట్‌గా నిలిచే ఈ చిత్రంలో ఆది, ఆదాశర్మ బాగా నటించారని, ట్రైలర్లకు, పాటలకు మంచి రెస్పాన్స్ లభిస్తోందని, ఫిబ్రవరి 12న ప్రేక్షకుల ముందుకు వస్తున్న తమ చిత్రాన్ని ఆదరించాలని దర్శకుడు మదన్ తెలిపారు☝. ఈ చిత్రానికి కథ, మాటలు:శ్రీనివాస్ గవిరెడ్డి, పాటలు:్భస్కరభట్ల, చైతన్యప్రసాద్, శ్రీమణి, పులగం చిన్ననారాయణ, ఫైట్స్:థ్రిల్లర్ మంజు, కెమెరా:పి.సురేందర్‌రెడ్డి, సంగీతం:అగస్త్య, నిర్మాత:పి.సురేఖ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం:మదన్👋.