శేఖర్ కమ్ములతో...మహేష్‌బాబు❗❗

  |   Tollywood

ప్రస్తుతం ‘బ్రహ్మోత్సవం’ షూటింగ్‌లో బిజీగా వున్నాడు మహేష్‌బాబు💦. ఈ సినిమా తరువాత ఆయన నటించే మరో చిత్రానికి అప్పుడే ప్రయత్నాలు చివరిదశలో వున్నాయి👍. ప్రముఖ తమిళ దర్శకుడు మురగదాస్ దర్శకత్వంలో తెరకెక్కే ఈ భారీ బడ్జెట్ చిత్రం ఫిబ్రవరిలో సెట్స్‌పైకి రానుంది☝. ఈ సినిమా తరువాత మహేష్ నటించే మరో సినిమా కోసం చర్చలు జరుగుతున్నాయి😰. టాలీవుడ్‌లో క్రేజీ దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఓ చిత్రంలో నటించేందుకు మహేష్‌బాబు అంగీకారం తెలిపాడని తెలిసింది👆. ఇప్పటికే శేఖర్ కమ్ముల దీనికి సంబంధించిన స్క్రిప్ట్‌ను రెడీ చేస్తున్నాడని తెలిసింది👌.