ఆసీస్ ను క్లీన్ స్వీప్ చేయండి: సచిన్👍🙌

  |   క్రికెట్

ఆస్ట్రేలియా గడ్డపై తొలిసారి ద్వైపాక్షిక సిరీస్ ఆడుతున్న టీమిండియా సాధించిన విజయాలపై మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ హర్షం వ్యక్తం చేశాడు😄. ప్రత్యేకంగా ట్వంటీ 20 సిరీస్ లో ఆసీస్‌ను వారి దేశంలో ఓడించిన టీమిండియాకు శుభాకాంక్షలు తెలియజేశాడు👏. దీంతో పాటు ఆసీస్‌ను క్లీన్ స్వీప్ చేస్తే చూడాలని ఉందంటూ తన మనసులోని కోరికను ట్వీట్ ద్వారా పంచుకున్నాడు😍. 'ధోని నేతృత్వంలోని టీమిండియా ఇంకా మ్యాచ్ మిగిలి ఉండగానే ట్వంటీ 20 సిరీస్ ను చేజిక్కించుకోవడం చాలా ఆనందంగా ఉంది😂. ఇది ఊపును కొనసాగించండి👍. మరో విజయాన్ని అందించి ఒక తీయటి జ్ఞాపకంతో భారత్ కు తిరిగి రండి' అని సచిన్ పేర్కొన్నాడు💦. 2008లో ఆస్ట్రేలియాలో జరిగిన సీబీ ట్రై సిరీస్ ను గెలిచిన ధోని సారథ్యంలోని భారత జట్టులో సభ్యుడైన సచిన్.. చివరి మ్యాచ్ లో విజయంతో ఆసీస్‌ను వైట్ వాష్ చేస్తే చూడాలని ఉందన్నాడు😍. మరి సచిన్ కోరికను ధోని అండ్ గ్యాంగ్ తీరుస్తారా?లేదో? చూడాల్సిందే☝.