కత్రినా జుట్టు రంగు కోసం అరకోటి ఖర్చైందట ..!❗❗

  |   Tollywood

పొడుగు కాళ్ళ సుందరి కత్రినా కైఫ్ ప్రస్తుతం అభిషేక్ కపూర్ దర్శకత్వంలో ఫితూర్ అనే చిత్రాన్ని చేస్తోండగా, ఈ చిత్రంలో కత్రినా జుట్టు ఎరుపు రంగులో కనిపించేందుకు దాదాపు 55లక్షలు ఖర్చు పెట్టినట్టు తెలుస్తోంది😲. కత్రినా జుట్టుకు ఫితూర్ చిత్ర షూటింగ్ జరిగినంత కాలం ఎరుపు రంగు వేయించగా, ప్రతీ సారి లండన్ వెళ్లి ఈ అమ్మడు కలర్ వేయించుకొని వచ్చిందట✈. ముంబైలో ఎరుపు రంగు వేసే ప్రొఫెషనల్స్ దొరకపోవడంతో యూనిట్ ఆ డెసిషన్ తీసుకున్నారట👍. అయితే లండన్ వెళ్ళిన ప్రతీ సారి కత్రినాతోపాటు ఆమె మేనేజర్ కు ైఫ్లెట్ టిక్కెట్స్ , ఉండడానికి ఫైవ్ స్టార్ హోటల్స్, ఇతర ఖర్చులు ఇలా అన్నీ కలిపి దాదాపు రూ.55 లక్షలు ఖర్చు అయిందట💰.ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 12న విడుదల చేయనుండగా, ఈ చిత్రం ప్రేక్షకులను ఎంతగా అలరిస్తోందో చూడాలి😊.