క్లీన్స్వీప్పై టీమిండియా గురి👍👍👍

  |   క్రికెట్

ఆస్ట్రేలియా క్రికెట్ జట్టుతో వన్డేల్లో ఎదురైన పరాభావానికి ట్వంటీ20ల్లో ఘన విజయంతో సమాధానం చెప్పింది టీమిండియా👍. మూడు మ్యాచ్ ల ట్వంటీ 20 సిరీస్లొ వరుస రెండు ట్వంటీ 20 లను గెలిచి ఆసీస్కు షాకిచ్చింది🌟. ఇంకా చివరి మ్యాచ్ మిగిలి ఉండటంతో అందులో కూడా విజయం సాధించి టోర్నీకి ఘనమైన ముగింపు ఇవ్వాలని ధోని సేన కసరత్తులు చేస్తోంది💪. ఆదివారం ఇరు జట్ల మధ్య సిడ్నీ వేదికగా ఆఖరి ట్వంటీ 20 జరుగనుంది👍.