నేను చనిపోయినట్లు ప్రచారం.......దాసరి నారాయణరావు💫 😟

  |   Tollywood

తాను మృతి చెందినట్లు ఫేస్‌బుక్(ఎఫ్‌బీ)లో కామెంట్లు వస్తున్నాయని అలాంటి కామెంట్లు, పోస్టులు చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలంటూ దర్శకరత్న దాసరి నారాయణరావు శుక్రవారం జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు👆. గత వారం రోజుల నుంచి ఫేస్‌బుక్‌లు, ఇతర సామాజిక మాధ్యమాల్లో తాను మృతి చెందినట్లు ఫొటోలు పెట్టి ప్రచారం చేస్తున్నారని వీటిని ఎవరు పోస్ట్ చేస్తున్నారో తెలుసుకొని వారిపై చర్యలు తీసుకోవాలంటూ ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు👊. ఈ మేరకు పోలీసులు జనరల్ డైరీ ఎంట్రీ నమోదు చేసి విచారణ చేపట్టారు☝.