పవన్ సినిమా ఆడియో వేడుకకు గెస్ట్ గా చిరు✨✨

  |   Tollywood

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన సర్ధార్ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుండగా, ఏప్రిల్ 8న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు👍. మార్చి 12న ఈ చిత్ర ఆడియో వేడుకను జరపాలని నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు👌. అయితే ఈ ఆడియో వేడుకకు గెస్ట్ ఎవరనే దానిపై అందరిలో ఆసక్తి నెలకొంది❓. మెగా హీరోల ఆడియో ఫంక్షన్‌లకు దాదాపు చిరంజీవే గెస్ట్‌గా హాజరై ప్రేక్షకులను అలరిస్తోండగా, పవన్ తాజా సినిమా వేడుకకు చిరు హాజరవుతారా లేదా అనేది ప్రశ్నార్ధకంగా మారింది❓. చిరు ఇటీవల సర్ధార్ చిత్ర షూటింగ్ సెట్‌కు వెళ్ళి కాసేపు హాడావిడి చేయగా, ఈ చిత్ర ఆడియో వేడుకకు ముఖ్య అతిధిగా పవన్ అన్నయ్య మెగాస్టార్ హాజరుకానున్నట్టు ప్రచారం జరుగుతోంది👍.