మరో రెండు వారాలు.. అదే జోరు..⭐⭐⭐

  |   Tollywood

ఇటీవల కాలంలో ఒకే రోజు రెండు మూడు సినిమాలు విడుదల కావడం మామూలైపోయింది👌.ఎక్కువ సార్లు వాయిదా వేయటం కన్నా బరిలో దిగి తేల్చుకోవటమే కరెక్ట్ అని భావిస్తున్నారు👍. అదే బాటలో మరో రెండువారాల పాటు తెలుగు వెండితెర మీద చిన్న సినిమాల జాతర కనిపించనుంది☝. ఫిబ్రవరి 12న కూడా ఇదే స్థాయిలో పోటీ పడుతున్నారు చిన్న చిత్రాల నిర్మాతలు🙌. భలే భలే మగాడివోయ్తో భారీ హిట్ కొట్టిన నాని కృష్ణగాడి వీర ప్రేమగాథతో రెడీ అవుతుంటే సాయికుమార్ తనయుడు తొలిసారిగా సొంత నిర్మాణసంస్థలో తెరకెక్కిన గరం సినిమాను రిలీజ్కు రెడీ చేస్తున్నాడు☝. ఈ ఇద్దరితో తలపడటానికి మంచు వారబ్బాయి కూడా రెడీ అవుతున్నాడు👍. డిఫరెంట్ లుక్తో మనోజ్ హీరోగా తెరకెక్కిన శౌర్య సినిమా కూడా అదే రోజు రిలీజ్కు రెడీ అవుతోంది👀.