రాజ్‌త‌రుణ్ ప‌త‌నం ప్రారంభ‌మైందా?❓❓

  |   Tollywood

వ‌రుస‌గా మూడు విజ‌యాల‌తో దూసుకుపోయాడు రాజ్ త‌రుణ్‌✨. మూడూ మెగా హిట్లే. చిన్న సినిమాలుగా వ‌చ్చి కోట్లు కొల్ల‌కొట్టాయి💰. దాంతో రాజ్ త‌రుణ్‌పై ద‌ర్శ‌క నిర్మాత‌ల దృష్టి ప‌డింది😏. మ‌రో రెండేళ్ల వ‌ర‌కూ రాజ్ కాల్షీట్లు ఖాళీ లేవు👍. అంత బిజీ అయిపోయాడు మ‌రి😰. అయితే తాజాగా విడుద‌లైన సీత‌మ్మ అందాలు - రామ‌య్య సిత్రాలు మాత్రం గ‌ట్టి షాక్ ఇచ్చింది💥. తొలి షోకే రొటీన్ క‌థ‌ అనే ముద్ర వేసేశారు😮. రాజ్ త‌రుణ్ ఎన‌ర్జీ త‌ప్ప మ‌రేం క‌నిపించ‌లేద‌ని పెద‌వి విరుస్తున్నారు విమ‌ర్శ‌కులు👎. రాజ్ త‌రుణ్ కూడా అవ‌స‌రానికి మించి ఓవ‌రాక్ష‌న్ చేశాడ‌ని గుస‌గుస‌లాడుకొంటున్నారు👎.