మోత మోగనున్న సంక్రాంతి🎊

  |   Tollywood

సంక్రాంతి పండుగకు స్పెషల్ ఐటెమ్ కోడిపందాలు✨. ఈసారి తెలుగు తెర కూడా కోడిపందాలను జరుపుకోనుంది👏. ఈ పందెంలో గెలుపు పుంజులు ఎవరు అనేది త్వరలో తెలియనుంది❓. సంక్రాంతికి బాలకృష్ణ కథానాయకుడిగా నటించిన ‘డిక్టేటర్’ రంగంలోకి దిగుతుండగా, జూ. ఎన్టీఆర్ నటించిన ‘నాన్నకు ప్రేమతో’ కూడా విడుదలవుతోంది👍. తానేం తక్కువ కాదంటూ ఈసారి నాగార్జున సంక్రాంతికి రంగంలోకి దిగుతున్నాడు సోగ్గాడిగా🏃. సోగ్గాడే చిన్నినాయన చిత్రంతో ఆయన సంక్రాంతి బుల్లోడిగా తెలుగు ప్రేక్షకులను అలరించనున్నాడు😍. సహజంగా ప్రతి సంవత్సరం డిసెంబర్‌లో తన సినిమా విడుదలయ్యాలా చూసుకునే నాగార్జున ఈసారి సంక్రాంతి కోడిపుంజుగా మారాడు👍. దీంతో టాలీవుడ్ సంక్రాంతి రసకందాయంలో పడింది👆. ఓవైపు బాలకృష్ణ, మరోవైపు ఎన్టీఆర్, ఇంకోవైపు నాగార్జున పందెం కోళ్ళులా కాలు దువ్వుతున్నారు😻.