150తో సరి..❓

  |   Tollywood

చిరంజీవి 150వ చిత్రం అదుగోపులి అంటే ఇదుగో తోక అన్నట్లు తయారైంది😬. మెగాస్టార్ చిరంజీవి నటించే ఆ చిత్రానికి సంబంధించిన ప్రారంభోత్సవ కార్యక్రమాలు జోరు అందుకున్నాయి😅. తమిళంలో సూపర్‌హిట్ అయిన ‘కత్తి’కి రీమేక్‌గా రూపొందే ఈ చిత్రానికి చిరంజీవి భారీ రెమ్యునరేషన్ అందుకుంటున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి👂. 30 కోట్లు పైగా అని పుకారు షికారు చేస్తోంది💰. ఇప్పటికే అడ్వాన్స్ కూడా అందిందని అంటున్నారు💵. ఈ చిత్రాన్ని చరణ్‌తోపాటు లైక్ ప్రొడక్షన్ అనే సంస్థ రూపొందిస్తుండగా వి.వి.వినాయక్ దర్శకత్వ బాధ్యతలు నిర్వహిస్తున్నారు👍.అయితే ఈ చిత్రం తర్వాత తాను ఇంక ఏ చిత్రంలో నటించనని, ప్రేక్షకులు అభిమానులు తన 150వ చిత్రంకోసం తహతహలాడుతున్న నేపథ్యంలో ఈ ఒక్క చిత్రంలో నటించనున్నానని, అమితాబ్‌లా జీవితాంతం సినిమాల్లో నటించే ఉద్దేశం తనకు లేదని చిరంజీవి స్పష్టం చేసినట్లు ఫిలిమ్‌నగర్ భోగట్టా☝!